Ram Charan Wax Statue: రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా..? Prime9 News 4 weeks ago మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్ఛాడు రామ్ చరణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకొని చిరు తనయుడు చరణ్ నుంచి చరణ్ తండ్రి చిరంజీవి అనేంతగా ఎదిగాడు. గ్లోబల్ స్టార్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే లండన్ వెళ్లి మైనపు విగ్రహానికి కొలతలు ఇచ్చిన చరణ్.. మే 10 న తన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇప్పటివరకు ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, కాజల్ విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ కి ఉన్నాయి. ఇక ఇప్పుడు చరణ్ విగ్రహం కూడా యాడ్ అయ్యింది. చరణ్ మైనపు విగ్రహం వద్ద మెగా ఫ్యామిలీ సందడి చేసింది. భార్య ఉపాసన, వారి పెంపుడు కుక్క రైమ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం ఆ విగ్రహం పక్కన నిలబడి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.