Janhvi Kapoor: అతిలోక సుందరి నేరుగా కిందకు దిగివచ్చినట్టుందే.. Roja Pantham 1 month ago Janhvi Kapoor continues to set fashion goals with her impeccable style and versatile looks అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తెలుగులో దేవర సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో కనిపించింది తక్కువే అయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో వస్తున్నా పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. అందాల ఆరబోతలో జాన్వీని కొట్టేవారు లేరు అంటే అతిశయోక్తి లేదు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటికి మొన్న లాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా మరోసారి జాన్వీ హాట్ ఫొటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఒకపక్క థైస్ అందాలను ఆరబోసి హీటెక్కించింది. అందాల భామ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జాన్వీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.