Honey Rose: హనీరోజ్ వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమాలో అసలు హీరోయిన్ శృతిహాసన్ కన్నా కూడా ఈ ముద్దుగుమ్మకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నిజానికి చెప్పాలంటే హనీరోజ్ 14సంవత్సరాల క్రితమే తెలుగులో 2008 లో శివాజీ హీరోగా తెరకెక్కిన ఆలయం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కూడా హనీరోజ్ కనిపించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరోయిన్ కి తెలుగులో అసలు గుర్తింపు రాలేదు. కాగా ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో ఈ అమ్మడు గుర్తింపే మారిపోయింది.