Deepthi Sunaina : సోషల్ మీడియా ఫేమ్ “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. ఒంటరిగా కంటే కూడా దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ జంటగా బాగా పేరు తెచ్చుకున్నారు. అయితే దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021లో దీప్తి సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ మేటర్ రివీల్ చేశారు. కారణాలు వివరించకున్నప్పటికీ… షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు అభిమానులతో పంచుకున్నారు. కాగా సిరి హన్మంత్ వలనే విడిపోయారన్న మాట గట్టిగా వినిపించింది.ప్రస్తుతం డిజిటల్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.