Actress Tamannah : మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార “తమన్నా”.. హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా… అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ… ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తమన్నా లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.