Actress Anjali : ప్రముఖ సినీ నటి అంజలి అంటే అందరికీ సుపరిచితురాలే. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయి లలో హీరోయిన్గా రాణిస్తున్న వారు తక్కువ మందే ఉన్నారు. కారణాలు తెలియవు కానీ దర్శక నిర్మాతలు పక్క రాష్ట్రాల అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికి పెట్టిన శ్రద్దలో సగం మన రాష్ట్రం మీద పెట్టిన పరిస్తితి వేరేలా ఉండేది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది హీరోయిన్ అంజలి. ఈ అచ్చతెలుగమ్మాయి తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో పుట్టి పెరిగింది.
ఫోటో సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. షాపింగ్ మాల్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటనకు గాను ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఇక అ[ప్పటి నుంచి అంజలి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ భామ మంచి విజయాలను అందుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఇక ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/