Prime9

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఖాతాల్లో నగదు జమ

PM Kisan Samman Nidhi Yojana Funds Release: దేశంలోని రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయాన్ని మూడు విడతలుగా.. ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. ఇప్పటివరకు 19 విడతలుగా నగదు విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఇప్పుడు రైతులందరూ 20వ విడత డబ్బుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

20వ విడత విడుదల తేదీ:

కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత డబ్బులు జూన్ 20, 2025న రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు మే-జూన్ నెలల్లో నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలలోనే డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

డబ్బులు పొందాలంటే ఈ పనులు తప్పనిసరి:

20వ విడత నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి. అవి:
ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం: పీఎం కిసాన్ పథకంలో డబ్బులు పొందడానికి ఇ-కేవైసీ తప్పనిసరి. దీన్ని పూర్తి చేయకపోతే మీకు డబ్బులు అందకపోవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా దగ్గర్లోని CSC సెంటర్లలో పూర్తి చేసుకోవచ్చు.
ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం: డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. అలాగే.. మీ బ్యాంకు ఖాతాలో DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ఆప్షన్ యాక్టివ్‌గా ఉండాలి.

 

మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి..?

మీరు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి:

 

Exit mobile version
Skip to toolbar