Site icon Prime9

Jagdeep Dhankar: ఎయిమ్స్‌లో చేరిన ఉప రాష్ట్రపతి.. ప్రధాని పరామర్శ

Vice President Dhankhar Admitted To AIIMS: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో ఆయనను తెల్లవారు జామున సుమారు రెండు గంటలకు ఎయిమ్స్‌ లో చేర్పిం చారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారని అధికార వర్గాలు చెప్పాయి.

అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య బృందం నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోం దని వివరించాయి. ధనఖడ్ పరిస్థితిని ఆరా తీయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‌‌కు వెళ్లారు. విషయం తెలియ గానే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జగదీప్ ధనఖడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Exit mobile version
Skip to toolbar