Site icon Prime9

UPSC Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు.. టాప్ ర్యాంకర్లు వీళ్లే!

UPSC CSE Results

UPSC CSE Results

UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేసింది. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం 1,056 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.

 

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీకి జూన్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూ నిర్వహించింది.

 

తాజాగా, ఇందుకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్‌ను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని క్వాలిఫై చేసింది. ఇందులో జనరల్ విభాగంలో 335 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్‌లో 109 మంది, ఓబీసీలో 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ విభాగంలో 87 మంది ఎంపికయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాణి 11 ర్యాంక్ సాధించింది.

 

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో శక్తి దుబే మొదటి ర్యాంకు సాధించగా.. వరుసగా హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్ కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి టాప్ 10లో నిలిచారు.

Exit mobile version
Skip to toolbar