Site icon Prime9

UPI Services: బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్

UPI services will be suspended on some mobile numbers from April 1: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్. కొన్ని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 1 ననుంచి ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం.. ఇనాక్టివ్ నంబర్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు పంపించేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇనాక్టివ్ నంబర్‌కు కూడా ఎలాంటి డబ్బులు పంపించలేరు.

 

అయితే, ఇనాక్టివ్ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు నిలిచిపోతుండగా.. బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అనవసరమైన వాడకంతో పాటు మోసాలకు చెక్ పెట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా, యూపీఐ పేమెంట్‌లో ప్రధానంగా ఫోన్ నంబర్ చాలా కీలకమైందని ఎన్‌పీసీఐ సూచించింది. ఇందులో ఓటీపీ వెరిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌పీసీఐ తెలిపింది.

 

ఇదిలా ఉండగా, ఎవరైనా ఫోన్ నంబర్లను కొనుగోలు చేసి నెలల తరబడి ఉపయోగించని యెడల ఆ నంబర్లను టెలికాం కంపెనీలు ఇతరులకు కేటాయించనున్నాయి. దీంతో ఎక్కువకాలం ఉపయోగించిన నంబర్లు కూడా ఇతరుల చేతిలోకి వెళ్తుంటాయి. ఇలా జరిగితే యూపీఐ ఖాతాలు సైతం వేరొకరి చేతిలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటివి మోసాలు జరిగే అవకాశం ఉన్నందున.. వీటిని అరికట్టేందుకు ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యాప్స్‌తో పాటు బ్యాంకులు సైతం ఇనాక్టివ్ నంబర్లను తొలగించనున్నాయి.

Exit mobile version
Skip to toolbar