Site icon Prime9

Minister Nityanand Rai: కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం.. సోదరుల మధ్య కాల్పులు

Union Minister Nityanand Rai nephew dead by brother gun fire: బీహార్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని భాగల్పూరు వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు మృతి చెందాడు. నీటి వివాదం సోదరుల మధ్య కాల్పులు జరిగాయి. సోదరుడి కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు విశ్వజీత్ చనిపోగా.. మరో మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి.

 

అయితే, బీహార్‌లోని భాగల్‌పుర్‌ సమీపంలోని జగత్‌పూర్ గ్రామంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుళ్ల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, అప్పటికే ఆ ఇద్దరి సోదరుల్లో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

 

ఇదిలా ఉండగా, తాగునీటి విషయంలో ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవకు ఆపేందుకు తల్లి ప్రయత్నించినట్లు తెలిపారు. కాగా, ఈ కాల్పుల్లో ఆమెకు కూడా బుల్లెట్ తగలడంతో గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

వీరు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌కు మేనల్లుళ్లు. ఆ ఇద్దరు కేంద్ర మంత్రి బావ రఘునందన్ యాదవ్ కుమారులు. ఇందులో జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ లు ఉన్నారు. కాగా, గ్లాసు నీటిలో ఒకరు చేతి పెట్టడంతో గొడవ జరిగిందని, ఈ ఘర్షణ కాస్తా కాల్పుల వరకు వెళ్లింది. ఈ కాల్పుల్లో విశ్వజిత్ మృతి చెందాడు.

Exit mobile version
Skip to toolbar