Site icon Prime9

UIDAI: ఇప్పుడు ఆధార్ చిరునామా మార్చుకునే విధానం మరింత సులభం.. ఎలాగంటే..?

uidai introduced A new method to Aadhar changes

uidai introduced A new method to Aadhar changes

UIDAI: గతంలో ఆధార్ కార్డులో అడ్రస్ మరి ఏ ఇతర చిన్నచిన్న మార్పులకు పట్టే సమయం, శ్రమ ఇప్పుడు లేకుండా కొత్త పద్దతులను తీసుకొచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ ).

ఇంటి పెద్ద (హెడ్ ఆఫ్ ది ఫామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్ లో ( ఆన్లైన్ లో ) చిరునామాను సులభంగా మార్చుకోవచ్చని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధృవీకరించే ఏదైనా పత్రమైన ( ప్రూఫ్ ) సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీటు, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్ పోస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర సర్టిఫికేట్స్ లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు.

అయితే ఇందులో ఇంటి పెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్ లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటి పెద్ద ఫోన్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ రిలేషన్ షిప్ ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటి పెద్ద సెల్ఫ్- డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్ లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియచేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది.

Exit mobile version