Prime9

RCB : ఆర్సీబీ కీలక ప్రకటన.. తొక్కిసలాట మృతులకు ఆర్థిక సాయం

RCB : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మృతిచెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గాయపడిన వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్‌ పేరిట ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

 

బుధవారం బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించింది. ఈ ఘటనలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. గాయపడిన అభిమానులను ఆదుకునేందుకు ఆర్సీబీ కేర్స్‌ పేరిట ఫండ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని కర్ణాటక సర్కారు ఇప్పటికే ప్రకటించింది. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు కర్ణాటక సీఎం బుధవారం వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar