Site icon Prime9

Amritsar: 30 మంది ప్రయాణీకులను వదిలిపెట్టి వెళ్లిన విమానం.. ఎక్కడో తెలుసా?

Amritsar

Amritsar

Amritsar: అమృత్‌సర్ విమానాశ్రయంలో 35 మంది ప్రయాణికులను వదిలి వెళ్లిన సింగపూర్‌ విమానం పై

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది.

సింగపూర్‌కు వెళ్లే స్కూట్ ఎయిర్ ఫ్లైట్ షెడ్యూల్ కంటే ముందే అమృత్‌సర్ నుండి బయలుదేరింది.

30 మంది ప్రయాణీకులకు టిక్కెట్లు బుక్ చేసిన వారి ట్రావెల్ ఏజెంట్ విమాన సమయం మార్పు గురించి తెలియజేయలేదు.

స్కూట్ ఎయిర్‌లైన్స్ సింగపూర్‌కు వెళ్లే విమానం రాత్రి 7 గంటల తర్వాత బయలుదేరాల్సి ఉంది.

అయితే ఎయిర్‌లైన్ బుధవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య దానిని రీషెడ్యూల్ చేసి,

ప్రయాణికులందరికీ ఇ-మెయిల్ ద్వారా అప్‌డేట్ చేసిందని అమృత్‌సర్ విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.

గ్రూప్‌లోని 30 మందికి టిక్కెట్లు బుక్ చేసిన ట్రావెల్ ఏజెంట్, సింగపూర్ వెళ్లే విమాన సమయాల్లో మార్పు గురించి

ప్రయాణికులకు తెలియజేయలేదని అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అధికారి తెలిపారు.

దీనితో ఆగ్రహం చెందిన ప్రయాణికులు నిరసన ప్రదర్శన చేయడంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది

వారు విమానాశ్రయంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

సుమారు 280 మంది ప్రయాణికులు సింగపూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే 253 మంది ప్రయాణికులు మాత్రమే విమానమెక్కారు.

స్కూట్ ఎయిర్‌లైన్ మరియు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ రెండింటి నుండి డీజీసీఏ వివరాలను కోరింది.

 

బెంగళూరులోనూ ఇదే సీన్ ..

ఇటీవల బెంగళూరు విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణీకులను వదిలిపెట్టి వెళ్లింది.

మిగిలిన ప్రయాణికులను నాలుగు గంటల తర్వాత మరో విమానంలో తరలించారు.

గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

పలువురు ప్రయాణికులు విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.

2023 జనవరి 9న ఉదయం 6.40 గంటలకు G8 116 విమానం ప్రయాణికులను వదిలి వెళ్లిపోయిందని వారు ఆరోపించారు.

ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు గో ఫస్ట్ నిరాకరించింది.

 

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వివాదం..

 

ఇండిగో Indigo విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అనుకోకుండా తెరిచిన ఘటనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్వయంగా

క్షమాపణలు చెప్పారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం తెలిపారు.

గత ఏడాది డిసెంబరు 10న చెన్నై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఎంపీ సూర్య

కాంగ్రెస్ నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఇండిగో మాట్లాడుతూ, చెన్నై విమానాశ్రయంలో ఎక్కిన తర్వాత ఒక ప్రయాణీకుడు

అనుకోకుండా విమానం యొక్క అత్యవసర మార్గాన్ని తెరిచాడని తెలిపింది.

అయితే వ్యక్తి ఎవరనేది వెల్లడించలేదు. దీనిపై మంత్రి సింధియా వివరణ ఇచ్చారు.

సంఘటన జరిగినప్పుడు, తేజస్వి సూర్య జీ స్వయంగా ఆ సంఘటనను నివేదించారు.

దాని ఆధారంగా పూర్తి ప్రోటోకాల్‌ను డీజీసీఏ స్వయంగా దర్యాప్తు చేసి వివరించింది.

అన్ని ఇతర తనిఖీలు జరిగాయి. అతను స్వయంగా క్షమాపణలు చెప్పాడని అనుకుంటున్నానని సింధియా అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version