Site icon Prime9

Veena Vijayan: కేరళ సీఎం విజయన్‌కు షాక్.. కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి

Veena Vijayan

Veena Vijayan

Central given Permission to Interrogate Kerala CM Pinarayi Vijayan’s daughter: కేరళ ముఖ్యమంత్రికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిన‌రయి విజ‌య‌న్ కూతురు చిక్కుల్లో పడ్డారు. ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఆర్థిక నేరం కేసులో వీణాను విచారించేందుకు ఆదేశించింది. న్యాయ విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్య‌వహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చిన్ మిన‌ర‌ల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ కంపెనీకి అక్ర‌మంగా డ‌బ్బులు బ‌దిలీ అయిన‌ట్లు తేలింది. సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ కార్యాలయం దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచార‌ణ‌కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కొచ్చిలోని ఆర్థిక నేరాల‌ను పరిశీలించే ప్ర‌త్యేక కోర్టులో కేసు ఫైల్ అయ్యింది.

 

అక్ర‌మ రీతిలో ఆర్థిక లావాదేవీలు..
సీఎంఆర్ఎల్‌, ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ మ‌ధ్య అక్ర‌మంగా ఆర్థిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మ‌ధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణాకు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బ‌దిలీ అయ్యాయి. దీంతో ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎస్ఎఫ్ఐవో ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఐవో త‌న ఛార్జ్‌షీట్‌లో వీణాతోపాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ‌శిథ‌ర్ కార్తా, మ‌రో 25 మంది నిందితుల పేర్ల‌ను చేర్చింది.

 

వీణ దోషిగా తేలితే పదేళ్లు జైలుశిక్ష..
ఈ కేసులో వీణ విజయన్ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్ర‌కారం శిక్ష ఉంటుంది. దీంతోపాటు జనిమానా విధిస్తారు. అక్ర‌మంగా వ‌సూలు చేసిన మొత్తంపై 3 రేట్ల జ‌రిమానా వ‌సూలు చేయ‌నున్నారు. కంపెనీస్ యాక్టులోని సెక్ష‌న్ 447 ప్ర‌కారం ఆరోప‌ణ‌లు చేశారు. ఈ సందర్భంగా 160 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు.

Exit mobile version
Skip to toolbar