Site icon Prime9

UP : వివాహం జరిగిన రెండురోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు

UP

UP: వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు చాలా సంబురంగా ఉన్నారు. పెళ్లైన కొత్త జంట రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు అత్తగారి ఇంటిలో అడుగుపెట్టిన దగ్గర నుంచీ కుటుంబ సభ్యులను మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజూ సాయంత్రం అందరికీ చాయ్ అందించింది. కోడలు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరు నుంచీ కుటుంబ సభ్యులు ఎంతో సంబురపడ్డారు. ఇంతలోనే వధువు పెద్ద కేకలు వేసింది. దీంతో అత్తింటి వారు ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. వెంటనే వధును ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు అన్నీ పరీక్షలు నిర్వహించారు. 9 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.

ఫిబ్రవరి 24న వివాహం..
ఫిబ్రవరి 24న అమ్మాయి-అబ్బాయికి పెండ్లి వైభవంగా జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి తర్వాత సాయంత్రం జస్రా గ్రామంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలు అర్ధరాత్రి పొద్దుపోయే వరకూ జరిగాయి. దీంతో మరుసటి రోజు ఫిబ్రవరి 25వ తేదీన వధువును ఆమె అత్తగారింటికి పంపించారు. కోడలు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎంతో సంబురపడ్డారు. బంధువులు, ఇరుగుపొరుగు సంతోషించారు. ఫిబ్రవరి 26న ఉదయం కుటుంబ సభ్యులందరికీ చాయ్ అందించింది. సాయంత్రం ఒక్కసారి ఆమెకు నొప్పి వస్తుందంటూ పెద్దగా కేకలు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు కార్చన సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి 9 నెలల గర్భవతి అని తేల్చారు. వెంటనే ప్రసవం చేయాలని వైద్యులు వెల్లడించారు. రెండు గంటల్లో వధువు బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు మొత్తం షాక్‌కు గురయ్యారు.

గర్భవతి విషయాన్ని దాచి పెట్టారు..
వధువు గర్భవతి విషయాన్ని దాచి పెట్టారని వరుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 2024 మే నెలలో వారికి పెళ్లి సంబంధం కుదరగా, అమ్మాయి-అబ్బాయికి శారీరక సంబంధం ఏర్పడిందని వధువు తండ్రి పేర్కొన్నాడు. ముందు నుంచీ వీరికి సంబంధం ఉందని తెలిపాడు. వధువు తండ్రి వాదనను వరుడు తోసిపుచ్చాడు. ఆమెను అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పాడు. వరుడు తండ్రి కూడా దీన్ని నిరాకరించాడు. తమ కుమార్తెను అంగీకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వధువు తల్లి హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వివాదం గ్రామ పంచాయతీకి చేరింది. ప్రస్తుతం బిడ్డతో కలిసి వధువు పుట్టింటికి చేరింది.

Exit mobile version
Skip to toolbar