Swami Nithyananda Death News: దేశంలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద(47) మృతిచెందారని జోరుగా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్వామి నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడం వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, నిత్యానంద.. ఓ సినీ నటి రంజితతో కలిసి ఉండడం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. అప్పటినుంచి ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనకు అహ్మదాబాద్ పట్టణంలో ప్రధాన ఆశ్రమం ఉండగా.. దేశ వ్యాప్తంగా 41కిపైగా చిన్న ఆశ్రమాలు ఉన్నాయని చెబుతున్నారు. నిత్యానంద సెక్స్ స్కాండల్ కేసులో ఇరుక్కోగా.. ఆయన దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు, 2019లో దేశాన్ని విడిచి పారిపోయిన నిత్యానంద.. కైలాస అనే దేశంను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటినుంచి అక్కడు ఉంటున్నాడు. ఒకవేళ అతను మరణిస్తే.. కైలాస దేశంతో పాటు రూ.4వేల కోట్లకు అధిపతి ఎవరనే విషయంపై జోరుగా చర్చ కొనసాగుతోంది. కాగా, ఆయన మేనల్లుడు త్వరలోనే పీఠం ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే నిత్యానంద లవర్ నందిత కూడా ఈ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని మరో వర్గం చెబుతోంది.
అయితే తాజాగా, ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు, రెండు రోజుల క్రితమే మరణించినట్లు ఆయన మేనల్లుడు ప్రకటిచండంతో చర్చనీయాంశంగా మారింది. కానీ ఆయన కేసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడానికే నిత్యానంద ఇలాంటి పనులు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.