PM Modi on Stock Markets: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు బద్దల కొడతాయి. అంత కంటే ముందే షేర్లు కొనుగోలు చేసుకొని పెట్టుకొండని ప్రజలకు సలహా ఇచ్చారు. మరి ప్రధాని జోస్యం వాస్తవ రూపం దాలుస్తుందా లేదా వేచి చూడాల్సింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం పోలింగ్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారు జూన్ 4 తర్వాత మార్కెట్లు ఎలా స్పందిస్తాయో అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడిదుడకులతో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు గత వారం సుమారు 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి తీసుకువెళ్లారు. దీంతో మార్కెట్లు కాస్తా డీలా పడ్డం సహజమే. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్4 తర్వాత లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లు రికార్డు బద్దలు కొడతాయని జోస్యం చెప్పారు. జూన్ 4 కంటే ముందే షేర్లు కొనుగోలు చేసుకొని పెట్టుకొండని సలహా ఇచ్చారు. మరి నిజంగా స్టాక్‌మార్కెట్లు ప్రధాని చెప్పినట్లు రికార్డు బద్దలు కొడుతుందా అనేది వేచి చూడాల్సిందే.
ఫలితాలు తర్వాత స్టాక్ మార్కెట్లు పరుగులు తీసి అలిసిపోవాల్సిందేనని మోదీ అన్నారు. గత పది సంవత్సరాల నుంచి చూస్తే సెన్సెక్స్ 25వేల పాయింట్ల నుంచి 75వేల మార్కుకు ఎగబాకిందన్నారు. దేశంలోని సామాన్యుడు కూడా స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టు చేస్తున్నాడని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడ్డంతో ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లు మదుపు చేస్తున్నారన్నారు ప్రధాని. గతంలో ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల షేర్లు అత్యంత బలహీనంగా ట్రేడ్ అయ్యేవి. ఎన్‌డీఏ ప్రభుత్వం పెద్దెత్తున సంస్కరణలు తీసుకురావడంతో పీఎస్‌యు షేర్లు కూడా స్టాక్ మార్కెట్లో రికార్డు బద్దలు కొడుతున్నాయన్నారు. అయితే ఏప్రిల్ 19 అంటే లోకసభ పోలింగ్ జరగడానికి ముందు నుంచి మార్కెట్లు ఒడిదుడకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రధానమంత్రి రంగంలోకి దిగి దేశ ప్రజలకు మార్కెట్లు బలపడతాయని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆర్థికమంత్రి అమిత్ షా కూడా ఇన్వెస్టర్లను జూన్ 4వ తేదీలోగా షేర్లు కొనుగోలు చేసి పెట్టుకోవాలని సూచించారు. మార్కెట్లు సరికొత్త రికార్డులు బద్దలు కొడుతాయని ప్రధానితో పాటు హోంమంత్రి కూడా హామీ ఇవ్వడం గమనార్హం.
ఇటీవల ఒపినీయన్ పోల్స్ కూడా విజయం బిజేపీదే అని చెబుతుండటంతో… ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చే అవకాశం ఉందని నోమురా ఇండియా అంచనా వేసింది. వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి మోదీ ప్రభుత్వం ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, తయారీ రంగంతో పాటు ఫిసికల్ కన్సాలిడేషన్‌పై ఫోకస్ పెడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు సరళతరమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై దృష్టి పెడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం విద్యుత్, చమురు సహజ వాయువు, ఆల్కాహాల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సరళతరం చేస్తుందని చెబుతున్నారు.
జూన్ 4న ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే.. స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోతాయనడంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి కాంగ్రెస్ గెలిస్తే.. స్టాక్ మార్కెట్లు రివర్స్‌గేర్‌లో పరుగులు తీస్తాయని మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు.