Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు

Southern Railway announces Sabarimala Special Trains: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది.

తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ – కొట్టాయం; కొట్టాయం – సికింద్రాబాద్‌; మౌలాలి – కొట్టాయం; కాచిగూడ – కొట్టాయం; మౌలాలి – కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వరకు ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. రైళ్లలో ఏసీ బోగీలతోపాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు సైతం ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు.