Site icon Prime9

Joshimath: జోషిమఠ్‌లో కుంగిపోతున్న ఇళ్ల.. ఊరి నుంచి వెళ్లిపోతున్న జనాలు.. అక్కడ ఏం జరుగుతుంది..?

Uttarakhand

Uttarakhand

Joshimath: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు. దాదాపు 60 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా మరో 29 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ప్రస్తుతం మరో 500లకు పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే అదే ప్రాంతంలో నివసిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రకృతి విపత్తులు, కొండచరియలు విరిగిపడటం, మౌలిక వసతుల కోసం చేపడుతున్న చర్యలు భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు అంటున్నారు. భూమి కుంగుబాటు వల్ల 3000 మందికి పైగా జనం ప్రభావితులయ్యారని జోషిమఠ్ మున్సిపాలిటీ చీఫ్ శైలేంద్ర పన్వార్ అన్నారు.తొమ్మిది వార్డుల్లో ఈ సమస్య ఉందని, కొండచరియలు విరిగిపడడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పారు. సింఘ్‌ధార్‌, మార్వాడీ ప్రాంతాల్లో పగుళ్లు కనిపిస్తున్నాయని, బద్రీనాథ్‌ ఎన్‌హెచ్‌ సింఘ్‌ధార్‌ జైన్‌, మార్వాడీలోని జేపీ కంపెనీ గేట్‌, అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలో ప్రతి గంటకూ ఈ పగుళ్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. జోషిమత్ని రెండు హోటళ్లను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. సునీల్ వార్డ్‌లోని అన్ని ప్రధాన రహదారులపై కూడా పగుళ్లు పెరుగుతున్నాయి, దీని కారణంగా ప్రజలు నడవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పన్వర్ చెప్పారు. ఇళ్లకు పగుళ్లు, భూమి కుంగిపోవడంతో ఆందోళనకు గురయిన ప్రజలు బుధవారం రాత్రి టార్చ్ లైట్ నిరసనను నిర్వహించారు. అన్ని ఇళ్లను మున్సిపాలిటీ సర్వే చేస్తోందని ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version