Site icon Prime9

Restrictions on export of rice: బియ్యం ఎగుమతులపై ఆంక్షలు…కట్టడి కానున్న ధరలు

Restriction on export of Rice

Restriction on export of Rice

Restrictions on export of rice: కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ధరలు కట్టడికి ఊతమిచ్చిన్నట్లైయింది. అన్నింటికి మించి దేశీయంగా ఆహార ధాన్యాలు నిల్వలు పెంచుకొనేందుకు తాజాగా కేంద్రం ప్రకటించిన ఎగుమతుల ఆంక్షలతో ఊరట నివ్వనుంది.

వివరాల్లోకి వెళ్లితే…గోదుమ నిల్వలు 14ఏళ్ల కనిష్టానికి చేరుకొన్నాయని అందరికి తెలిసిందే. దీంతో ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకొనడంపై దృష్టి సారించిన కేంద్రం సామాన్యుడికి ఊరటినిచ్చే అంశాలపై దృష్టి సారించింది. ఉప్పుడు బియ్యం ను ఎగుమతుల నుండి మినహాయిస్తూ బియ్యం, బాస్మతి రకాలపై 20శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చేలా కేంద్ర ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానంగా దేశ వ్యాప్తంగా బియ్యం సరఫరాను విస్తృతం చేయడానికి తాజా ఆంక్షలు దోహదపడనున్నాయ్. మరో వైపు నూకలపై పూర్తిగా ఎగుమతులను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో నూకలు ధరలు సైతం చుక్కలు చూపిస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటన ధరల కట్టడికి ఊతమిచ్చిన్నట్లైయింది.

ఆంక్షల్లో కేంద్రం ప్రస్తావిస్తూ…ఇప్పటికే ఎగుమతుల కోసం ఓడ రేవులకు తరలించడం, రవాణాకు సిద్దం చేసిన బియ్యంపై కొద్దిగా సడలింపులు ఇస్తూ పర్యవేక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ) ఆధ్వర్యంలో చేపడుతున్న గోదుమ, బియ్యం సరఫరా  నిత్యం సాగుతుంటుంది. నిల్వలు తగ్గిన్నట్లుగా గుర్తిస్తున్నా…బియ్యం విషయంలో పరిమితికి మించిన నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది.

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం గరీభ్ కళ్యాణ్ అన్న యోజన పధకం ద్వారా ప్రజలకు బియ్యం పంపిణీ చేపట్టి కష్ట కాలంలో ఆదుకొన్న సంగతి తెలిసిందే..అయితే ఈనెల 30 అనంతరం ఉచిత రేషన్ బియ్యం కొనసాగింపుపై నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాల్సి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా లేదు..దీంతో ఆహార భధ్రతపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తాజాగా బియ్యం ఎగుమతులపై సుంకం విధిస్తూ ఆంక్షలు తీసుకురావడం శుభపరిణామంగా భావించాల్సి ఉంది.

Exit mobile version