Site icon Prime9

PM Modi: ‘సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని వీక్షించిన ప్రధాని.. ఇన్నాళ్లకు గోద్రా నిజం బయటకు వచ్చిందని వెల్లడి

Pm Modi Watches ‘Sabarmati Report’: గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎంపీలు, ఇతరులు ఈ చిత్రాన్ని చూశారు.

2002లో గుజరాత్‌లో గోద్రా ఆధారంగా తెరకు..
2002 సంవత్సరంలో గుజరాత్‌లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా నవంబర్‌ 15న విడుదలైంది.

ప్రశంసించిన ప్రధాని మోడీ..
ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని ఇటీవల ఓ నెటిజన్‌ చేసిన సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌పై ప్రధాని మోడీ స్పందించారు. ‘కల్పిత కథనాలు పరిమితకాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సత్యాన్ని ప్రదర్శించడానికి సినిమా చేసిన ప్రయత్నాలకు ప్రధాని మోడీ ప్రశంసించారు. ‘ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూసే విధంగా. ఒక నకిలీ కథనం పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. అంతిమంగా వాస్తవాలు ఎప్పటికీ బయటకు వస్తాయి’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.

సినిమాను మెచ్చుకున్న సీఎంలు..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగి ఆదిత్యనాథ్, గోవాకు చెందిన ప్రమోద్ సావంత్‌తో సహా ముఖ్యమంత్రులు కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. కొన్ని రాష్ట్రాలు వీక్షకుల సంఖ్యను ప్రోత్సహించడానికి పన్ను రహితంగా చేయాలని నిర్ణయించాయి. ప్రముఖ నాయకులు, నటీనటులు 2002 నాటి గోద్రా ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రధానంగా హైలెట్ అయ్యాయి.

Exit mobile version
Skip to toolbar