PM Modi Says India and New Zealand to Institutionalise Defence and Security Cooperation: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలకు ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి.
ప్రధానంగా రక్షణ, భద్రత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా రక్షణకు సహకారం అంశానికి సంబంధించి ఓ కొత్త రోడ్ మ్యాప్ చేసేందుకు సిద్దం చేయనున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రక్షణ, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సంబంధాల కోసం విస్తృత పరిచేందుకు ఇరు దేశాల ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా, ఇండో- పసిఫిక్ రీజియన్‌లో సంబంధాలను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఉగ్రవాదం విషయంలో ఇరు దేశాల అభిప్రాయం ఒకటేనని, ఉగ్రవాదం ఎక్కడా ఉన్నా సహించేది లేదని ప్రధాని మోదీ అన్నారు. గతంలో 2019లో ఓ చర్చితో పాటు 2008 ముంబైపై దాడులు వంటి ఉగ్రవాదంపై అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ ప్రధాని లక్సన్, దేశ ప్రధాని మోదీ మధ్య ఆసక్తికరమై సంఘటన చోటుచేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రస్తాదించారు. ఈ విషయానికి బదులుగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ చమత్కరించారు. భారత్ టీంపై న్యూజిలాండ్ సాధించిన టెస్ట్ విజయాలపై ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. దీంతో ప్రధాని మోదీతో పాటు పలువురు నవ్వులు చిందించారు.