Site icon Prime9

Peddpalli Train Accident: 39 రైళ్లు రద్దు.. 7 రైళ్లు రీ షెడ్యూల్‌

Peddpalli Train Accident: పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి-రామగుండం మధ్య రాఘవాపూర్‌ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తాపడింది. ఐరన్‌ కాయిల్స్‌తో ఓ రైలు ఓవర్‌లోడ్‌లో వెళ్తున్నది. దీంతో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్‌లు తెగిపోవడంతోపాటు ఒకదానిపై మరో బోగి పడి మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు. ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కొనసాగుతున్న సహాయ చర్యలు..
రాఘవాపూర్‌ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ట్రాక్‌పై బోల్తాపడిన గూడ్స్ డబ్బాలను సిబ్బంది తొలగిస్తున్నారు. తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారు. కొత్త పట్టాలను ఘటనా స్థలికి తెప్పించి శరవేగంగా అమర్చుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version