PAN-Aadhaar LINK: పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్‌కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.
మార్చి 31 వరకు పాన్ ఆధార్ లింక్ కు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్‌లు చెల్లవని కావని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది.
పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించే గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది.
ప్రస్తుతం రూ. 1000 ఫీజు చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చారు.
అయితే, అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు చెల్లదు.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ – ఆధార్ లింక్ చేసుకునేందుకు వీలు ఉంది
ఆన్‌లైన్‌లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు.
అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN టైప్ చేసి SMS చేయొచ్చు.
మరో వైపు ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకునే వాళ్లు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది వినియోగించలేము.
అయితే దీని నుంచి కొంతమందికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
2017 మే లో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..
పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది.
అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్‌లు
80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.
ఇండియన్ పౌరులు కాని వారు