Site icon Prime9

What is kalima?: ఇస్లాంలోని కల్మాలు చదవలేదని ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు..?

pahalgam terrorists asked to read tourists to kalima or kalma in islam

pahalgam terrorists asked to read tourists to kalima or kalma in islam

 

What is kalima? Why terrorist asked to chant kalima in Pahalgam Terror Attack: పహల్గాం దాడిలో పర్యాటకులను హతమార్చే ముందు ముస్లింలు కానివారిని గుర్తించడానికి ఉగ్రవాదులు కల్మాలు చదవాలని అడిగారు. అసలు ఏమిటీ ఈ కల్మాలు, వీటి ప్రముఖ్యత ఇస్లాంలో ఏంటి?

 

కల్మాలు లేక కలిమా అని అంటారు. ఇవి ఇస్లాం మతంలో అల్లా తప్ప మరొక్కదేవుడు లేడని మహమ్మద్ మాత్రమే చివరి ప్రవక్త అని కల్మాలలో రాసి ఉంది. వీటిని ముస్లింలు తప్పని సరిగా పఠిస్తారు.

 

మంగళవారం మధ్యాహ్నం కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులు సేదతీరుతుండగా తీవ్రవాదులు వారిని చుట్టుముట్టి ప్రాణాలు తీశారు. అయితే ముస్లింలు కానివారిని గుర్తించడానికి  కల్మాలు చదవమని ఆజ్ఞాపించారు. కల్మాలు రానివారిని ముస్లింలు కాదని నిర్దారించుకున్నాక వారిని చంపేశారు. ఈ ఘటనలో 26మంది పర్యాటకులు ప్రాణాలు విడిచారు.

 

ఉగ్రదాడిలో ఒక హిందువు  ముస్లింగా నిరూపించుకోవడానికి కల్మా పఠించాడు
అస్సాం నుంచి కాశ్మీర్ లోని పహల్గాంకు టూరిస్టుగా వచ్చిన దేబాసిష్ బట్టాచార్య తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కల్మాను బిగ్గరగా చదివానని చెప్పాడు. “ఒక ఉగ్రవాది నా దగ్గకు నడుచుకుంటూ వచ్చాడు. అతను నన్ను ఏమి చదువుతున్నావని అడిగాడు. నేను లా ఇలాహి ఇల్లల్లాహ్ అని పదే పదే చదవసాగాను. ఏదో కారణం చేత అతను తిరిగి వెళ్లిపోయాడు”అని అసోసియేట్ ప్రొఫెసర్ భట్టాచార్య చెప్పారు.

 

కెన్యాలో కూడా కల్మాలను చదవమన్న ఉగ్రవాదులు
కెన్యాలో 2014లో జరిగిన బస్సుదాడిలో 28 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బస్సులో ఉన్నవారిని కల్మాలు చదవాలని చెప్పగా, చదవని వారిని ముస్లింలు కాదని నిర్దారించుకున్నారు. ఆతర్వాత వారిపై గుళ్లవర్షం కురిపించారిని కెన్యా పోలీసులు తెలిపారు.

 

అసలు కల్మాలు అంటే ఏమిటి అందులో ఏముంది..
ముస్లిం మత విశ్వాసాల ప్రాథమిక సూత్రాలుగా కల్మాలు గుర్తించబడ్డాయి. ఇవి అల్లాహ్ దయ, రక్షణ కోరుతున్నట్లుగా ఉంటాయి.

 

1. మొదటి కల్మా: కల్మా తయ్యిబ్ (స్వచ్ఛత)
మొదటి కల్మాను కల్మా తయ్యిబ్ అని పిలుస్తారు. ఇందులో అల్లాహ్ యొక్క ఏకత్వంతో పాటు, ముహమ్మద్ మాత్రమే చివరి ప్రవక్త అని తెలుపుతుంది. దీనిని ముస్లింలు పఠించడం ద్వారా, ఒక ముస్లిం అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని, ముహమ్మద్ మాత్రమే అల్లాహ్ దూత అని ధృవీకరిస్తారు.

 

“లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరికా లాహు, లహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.” ఈ సూక్తికి ముస్లిం వెబ్ సైట్లు ఈవిధంగా అర్థం చెబుతున్నాయి. “అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ముహమ్మద్ మాత్రమే అతని దూత.

 

2. రెండవ కల్మా: కల్మా షహదా (సాక్ష్యం)
ఇది అల్లా పట్ల విశ్వాసానికి సాక్ష్యం, అల్లా యొక్క ఏకత్వం, ముహమ్మద్ ప్రవక్తత్వంపై విశ్వాసాన్ని నొక్కి వక్కానిస్తుంది. ఈ కల్మా ఒక వ్యక్తి ఇస్లాంను అంగీకరించినప్పుడు పఠించబడుతుంది.

“అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షారిక లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.” ఇస్లామిక్ వెబ్‌సైట్‌ల ప్రకారం… “అల్లా తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, మరే దేవుడు ఈ ప్రపంచంలో లేడు, ముహమ్మద్ మాత్రమే అతని దూత అని నేను సాక్ష్యమిస్తున్నాను.”

 

3. మూడవ కల్మా: కల్మా తమ్జీద్ (మహిమపరచడం)
ఈ కల్మాలో అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఇది అల్లాపై లోతైన కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తుంది. ఆయన అధికారాలను ముస్లింలు అంగీకరిస్తున్నట్లుగా ఉంటుంది.

“సుభానల్లాహి వల్హందులిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, వ లా హవ్లా వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహి అలియిల్ అదీమ్”

దీని అర్థం, “అల్లాహ్ కు మాత్రమే అన్ని స్తోత్రాలు మహిమలు చెందుతాయి, అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, అల్లాహ్ నే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరేదీ లేదు, ఆయనే సుప్రీం.”

 

4. నాల్గవ కల్మా: కల్మా తౌహీద్ (ఐక్యత)
ఇది అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. మరే దేవుడు లేడని గుర్తుచేస్తుంది.

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహీ వ యుమీతో వ హోవా హై యుల్ లా యమూతో అబాదన్ అబాద జుల్ జలాలి వల్ ఇక్రమ్ బెయాదిహిల్ ఖైర్. వా హౌవా అలా కుల్లి షాయీ ఇన్ ఖదీర్”

“అల్లాహ్ తప్ప పూజించడానికి వేరేవారెవూ అర్హులు కారు. ఆయన ఒక్కడే దేవుడు. దేశం ఆయనకే చెందుతుంది. ఆయన జీవితాన్ని ప్రసాదిస్తాడు, మరణాన్ని కూడా. ఆయన ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు.”

 

5. ఐదవ కల్మ: అస్తఘ్ఫర్ (తపస్సు)

చేసిన పాపాలన్నింటికి క్షమాపణ కోరడాన్ని ఈ కల్మా సూచిస్తుంది.

“అస్తగ్ఫిరుల్లా రబ్బీ వ కుల్లయ్ జాంబి అజాబ్ తుహో అమదన్ అవో ఖేత్ అన్ సిర్రాన్ ఏవో అలనియాతన్ వా అతుబు ఇలైహీ మన ప్రజలను క్షమించేవాళ్ళం మరియు మన ప్రజలను క్షమించేవాళ్ళం అజీమ్”
” నేను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నింటికి నా దేవుడైన అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతున్నాను. అల్లాహ్ తప్ప వేరే శక్తి లేదు.”

 

6. ఆరవ కల్మా: రద్దే కుఫ్ర్ (అవిశ్వాసాన్ని తిరస్కరించడం)
ముస్లింలు అన్ని రకాల బహుదేవతారాధనలను మానివేసి, ఏకైక నిజమైన దేవుడు అల్లాహ్ కు మాత్రంఏ విధేయతను ప్రకటించే ప్రార్థన.

 

“అల్లా-హుమ్మా ఇన్నీ అదు-బికా మిన్ అన్ ఉష్రికా బికా షే-ఔన్ వా-అనా అ\’లము బిహీ వా- అస్తఘ్ఫిరుక లిమా లాఆ అ\’లము బిహీ.
“ఓ అల్లాహ్, నేను నీవు వేరే ఆరాధన చేయకుండా కాపాడు. నాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలకు నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను”.

 

ఇవి ఇస్లాంలోని కల్మాలు వీటిని ముస్లింలు ప్రాథమికంగా పఠిస్తారు. వీటి ముఖ్య ఉద్దేశం అల్లాహ్ మాత్రమే ఏకైక సృష్టికర్తని ఆయన తప్ప వేరే సృష్టికర్త లేరని చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఉద్రదాడులలో తీవ్రవాదులు టూరిస్టులను కల్మాలు చదవమనడంతో ప్రపంచం నివ్వేరపోయింది. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26మంది ప్రాణాలు విడిచారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు.

Exit mobile version
Skip to toolbar