DA Hike: దీపావళికి ముందు ఛత్తీస్‌గఢ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి పెరిగింది. రాష్ట్ర ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కరువు భత్యం అందనుంది.
రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడిన సీఎం సాయి.. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉద్యోగులందరికీ ప్రస్తుతం 46 శాతం డీఏ లభిస్తుండగా, వారి డీఏను 4 శాతం పెంచుతున్నామని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి వారికి 50 శాతం డీఏ లభిస్తుందని సవరించిన 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. విష్ణు దేవ్ సాయి ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, లక్ష మందికి పైగా పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు.
వివిధ మీడియా నివేదికల ప్రకారం.. నేటి మోడీ క్యాబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) పెంపును ప్రకటించవచచని తెలుస్తోంది. ేంద్ర ఉద్యోగుల డీఏలో 3 శాతం పెంపు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ పెంపు జూలై 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. ఈ పెంపు వల్ల 1 కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని అంచనా.