Site icon Prime9

Cm Naveen Patnaik : హాకీ వరల్డ్‎కప్ గెలిస్తే ఒక్కో ప్లేయర్‎కు రూ.కోటి… ఒడిశా సీఎం బంపర్ ఆఫర్

odisha-cm-bumper-offer to indian players about hockey-world-cup

odisha-cm-bumper-offer to indian players about hockey-world-cup

Cm Naveen Patnaik : హాకీ వరల్డ్ కప్‌‌‎ను భారత్ జట్టు గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కి రూ.కోటి నజరానా ఇస్తానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రూర్కెలాలో బిర్సా ముందా హాకీ స్టేడియం కాంప్లెక్స్ వద్ద ప్రపంచ కప్ విలేజ్‎ను ఆయన ప్రారంభించారు. అనంతరం టీం ఇండియాకు బెస్ట్ బిషెస్ తెలిపారు.

ప్రపంచ కప్ విలేజ్ ను రికార్డు స్థాయిలో తొమ్మిది నెలల్లో నిర్మించారు. హాకీ ప్రపంచ కప్ స్థాయికి తగిన అన్ని సౌకర్యాలతో 225 గదులను కలిగి ఉంది. ప్రపంచ కప్ విలేజ్‌లో ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చే జట్లు మరియు అధికారులు ఉంటారు.ఈ సందర్భంగా ప్రపంచకప్ విలేజ్‌లో వసతి పొందుతున్న జాతీయ పురుషుల హాకీ జట్టుతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.మన దేశం ప్రపంచకప్ గెలిస్తే టీమ్ ఇండియాలోని ప్రతి ఆటగాడికి కోటి రూపాయల బహుమతి లభిస్తుంది. నేను టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఛాంపియన్‌లుగా నిలుస్తారని ఆశిస్తున్నాను’ అని పట్నాయక్ అన్నారు.

ఈ సందర్బంగా హాకీ క్రీడాకారులు ఒడిశా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దేశంలోని హాకీ క్రీడాకారుల కోసం కోసం సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.భారత్‌లో వరుసగా రెండోసారి హాకీ ప్రపంచకప్‌ నిర్వహిస్తున్నారు. జనవరి 13 నుంచి జనవరి 29 వరకు ప్రపంచకప్ మ్యాచ్‎లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్ మొత్తం ఒడిశాలోని రెండు స్టేడియాల్లో జరగనుంది.

Exit mobile version