Site icon Prime9

NDA Meeting: ఎన్డీయే నేతల భేటీ.. రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం

NDA meeting today Key meet at JP Nadda’s residence: త్వరలోనే ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్నట్లు సమాచారం.

కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. ఇందు కోస్ మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అయితే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలుతోపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై ఎన్డీయే నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.

జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై సైతం చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం మూడోసారి ఎన్డీఏ నేతలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా నేతలు సమావేశం అవుతున్నారు.

అయితే, ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నత నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ భేటీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు చర్చించనున్నాయి. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన కొనసాగుతోంది. దీనిపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంకోవైపు నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ జయంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని ఆయన సమాధికి సమీపంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఉదయం జరుగుతుంది. అనంతరం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు.

Exit mobile version
Skip to toolbar