Site icon Prime9

నరేంద్ర మోదీ: పేదలకు ప్రధాని మోదీ న్యూయర్ గిఫ్ట్.. ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ

NFSA

NFSA

PM Narendra Modi: దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై రూ.2 లక్షల కోట్ల భారం పడనుంది. ఆహార ధాన్యాల కోసం ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. గతంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించేవారు. అయితే తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇకపై పేదలు ఉచితంగా వీటిని పొందుతారు.

2020లో ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ఈ పథకం ప్రారంభించింది. దీని కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈ పథకం డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పేదలకు గతంలో సబ్సిడీ ధరలపై ఆహార ధాన్యాలు అందించేవారు. అయితే, వారు ఇప్పుడు ప్రయోజనాలను ఉచితంగా పొందగలుగుతారు.

Exit mobile version
Skip to toolbar