Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

Man Fires At Sukhbir Singh At Golden Temple: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణదేవాలయం దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌భీర్ సింగ్ బాదల్‌‌పై  హత్యాయత్నం చేయగా.. తృటిలో పెను ముప్పు తప్పింది.

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌భీర్ సింగ్ బాదల్‌ ప్రార్థన చేసిన అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ దుండుగుడు కాల్పులకు యత్నించాడు. వెంటనే సుఖ్‌భీర్ సింగ్ అనుచరులు స్పందించి దుండగుడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో సుఖ్‌భీర్ సింగ్‌కు తృటిలొో ప్రమాదం తప్పింది. పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో  హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడు నారాయణ్‌సింగ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

అకాల్ తఖ్త్ విధించిన శిక్ష విషయంలో గోల్డెన్ టెంపుల్ వద్ద సుఖ్‌బీర్ సింగ్‌పై కాల్పులు జరిగాయి. అయితే రెండో రోజు స్వర్ణ దేవాలయానికి వెళ్లిన ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. స్వర్ణదేవాలయం వద్ద సుఖ్‌బీర్ సింగ్ వేచి ఉండగా.. తుపాకీతో దుండగుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఇంతలోనే ఆయనపై దుండుగుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఆలయ సిబ్బంది, బాదల్ అనుచరులు అప్రమత్తమై దుండుగుడిని అడ్డుకున్నారు. అయితే అప్పటికే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో తుపాకీ గాల్లో పేలింది. దీంతో బుల్లెట్ పక్కన ఉన్న గోడకు తగిలి కిందపడింది. నిందుతుడు దల్ ఖల్సాకు చెందిన నారాయణ్ సింగ్ చోర్హాగా గుర్తించారు.