Site icon Prime9

JNU VC Santishree Dhulipudi Pandit: శివుడు ఎస్సీ లేదా ఎస్టీ.. జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి

New Delhi: హిందూ దేవళ్లు మరియు దేవతలు అగ్రవర్ణాలకు చెందినవారు కాదని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి అన్నారు. లింగ న్యాయం: యూనిఫాం సివిల్ కోడ్ డీకోడింగ్ పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు’ అనే అంశంపై మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాదు. శివుడు శ్మశాన వాటికలో కూర్చున్నందున తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవాడై ఉండాలి. అతనితో పాములు ఉంటాయి. అతను చాలా తక్కువ బట్టలు ధరిస్తాడు. బ్రాహ్మణులు శ్మశాన వాటికలో కూర్చుంటారని నేను అనుకోవడం లేదు. శివుడు కూడా ఎస్సీ/ ఎస్టీ కి చెందినవాడు కావచ్చని అన్నారు. మాతా లక్ష్మి, శక్తి మరియు జగన్నాథుడు కూడా మానవజాతి శాస్త్రం ప్రకారం అగ్రవర్ణాల నుండి రాలేదని అన్నారు. జగన్నాథుడు నిజానికి గిరిజన మూలానికి చెందినవాడని ఆమె పేర్కొన్నారు.

మనుస్మృతి ప్రకారం మహిళలందరూ శూద్రులని నేను మహిళలందరికీ చెబుతాను. కాబట్టి ఏ స్త్రీ కూడా తాను బ్రాహ్మణురాలినని చెప్పుకోదు. స్త్రీలు తమ తండ్రి లేదా భర్త నుండి కులాన్ని వారసత్వంగా పొందుతారు. ఇది అసాధారణంగా తిరోగమనం చేసే విషయం అని నేను అనుకుంటున్నాను. బాబాసాహెబ్ అభిప్రాయాలను మనం పునరాలోచించడం చాలా ముఖ్యం. ఆధునిక భారతదేశం నుండి ఇంత గొప్ప ఆలోచనాపరుడైన నాయకుడు మనకు లేడు. మనలను నిద్రలేపిన వారిలో గౌతమబుద్దుడు మొదటివాడని శాంతిశ్రీ అన్నారు.

Exit mobile version