Site icon Prime9

ISRO PSLV-C 61: నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ – సీ 61.. రాకెట్ దారి తప్పిందా?

ISRO launched the EOS-09 satellite

ISRO launched the EOS-09 satellite

ISRO launched the EOS-09 satellite Racket Technical Issue In PSLV-C61: ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ – సీ 61 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ – సీ 61 రాకెట్ ఉదయం 5.59 నిమిషాలకు ప్రయోగించగా.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ – సీ 61 ద్వారా ఈఓఎస్ 09 (రీశాట్ 1బీ) శాటిలైట్ నింగిలోకి ప్రవేశపట్టనుంది. దేశ రక్షణ నిఘా, పర్యవేక్షణ వంటి కార్యక్రలాపాలను ఈఓఎస్ -09 మెరుగుపర్చనుంది.

 

పీఎస్‌ఎల్-సీ 61 పూర్తి స్వదేశీ ఆధారంగా ఈఓఎస్ 09 రూపొందించారు. ఈ ఈఓఎస్ 09 ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలందించనుంది. కాగా, ఇస్రోకు ఇది 101వ ప్రయోగం కావడం విశేషం. ఈ ఉపగ్రహం ఎలాంటి వాతారణ పరిస్థితుల్లోనైనా అధిక రెజల్యూషన్‌తో చిత్రాలు పంపనుంది. అంతేకాకుండా దేశ భద్రత, అటవీ పర్యవేక్షణలో ఈఓఎస్ 09 సేవలు అందించనుంది. విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో సేవలు అందించనుంది.

 

అయితే, పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగించిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. పీఎస్ఎల్‌వీ ప్రయోగం పూర్తికాలేదని, పరిశీలించిన అనంతరం విశ్లేషణ తర్వాత పూర్తి సమాచారం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar