Site icon Prime9

Big Alert HMPV Virus: భారత్‌లోకి హెచ్ఎంపీవీ వైరస్ వచ్చేసింది..తొలి కేసు నమోదైంది ఇక్కడే!

HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లోకి వచ్చేసింది. భారత్‌లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది.  బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దీనిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించారు. చైనాలో ప్రబలిన ఈ వైరస్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని వెల్లడించారు.

వివరాల ప్రకారం.. బాప్టిస్ట్ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల బిడ్డకు పరీక్షలు జరపగా.. పాజిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ స్పందించింది. ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షలు చేయలేదని, ప్రైవేట్ ఆస్పత్రిలో చేసిన పరీక్షలు తాము అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫ్లూ వంటి నమూనాల్లో కూడా 0.7 శాతం వరకు హెచ్ఎంపీవీ గుర్తిస్తున్నారు. కాగా, భారత్‌లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు ఇదే కావడం గమనార్హం. అయితే 11 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న చిన్నారుల్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, హెచ్ఎంపీవీ వైరస్ దగ్గు, తుమ్మడంతో వెలువడే తుంపర్లు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే వైరస్ బారిన పడిన వారితో కలిసి తిరగడం, తాకడం, షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కూడా వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుందన్నారు. దీంతో పాటు వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో తాకిన అనంతరం నోటి, ముక్కు, కళ్లను సైతం తుడుచుుకున్న వైరస్ వ్యాప్తం వేగంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version