Site icon Prime9

Petrol & Diesel Price Hiked: బిగ్ బ్రేకింగ్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.2 పెంపు.. నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి..!

Government increases excise duty on Petrol Diesel Prices

Government increases excise duty on Petrol Diesel Prices

Central Government Hiked excise duty on Petro and Diesel Prices for Rs 2 Only: పెట్రోల్, డీజిల్‌ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లీటర్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. పెంచిన ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెట్రో ధరల పెంపుదలపై కేంద్రం మరో వివరణ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

 

కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని కంపెనీలు భరించనున్నట్లు స్పష్టత ఇచ్చింది. దీంతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో గత కొంతకాలంగా కేంద్రం ఇంధన ధరల జోలికి వెళ్లడం లేదు. తాజాగా, పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.40 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.70గా ఉంది.

 

ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని దేశాలపై టారిఫ్స్ విధించారు. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కాగా, అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం గమనార్హం. అయితే అంతర్జాతీయ స్థాయిలో పెట్రో ధరలు తగ్గినందున ఈ అడిషనల్ భారాన్ని పెట్రో సంస్థలు భరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar