Site icon Prime9

Gas Cylinder Price Hiked: సామాన్యులకు బిగ్ షాక్.. వంట గ్యాస్ సిలిండర్ రూ.50 పెంపు

Gas cylinder price

Gas cylinder price

Rs 50 Hiked on Gas cylinder: దేశంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కాసేపటికే వంట గ్యాస్ ధరలు పెంచింది. వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు సైతం ఈ పెంపు వర్తించనుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెంచగా.. ఈ ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడారు. 14.2కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.500 నుంచి రూ.550 వరకు పెరిగిందన్నారు. పెంచిన ఈ ధరలు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే సాధారణ వినియోగదారులకు 14.2కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.803 ఉండగా..రూ.853కు పెరిగింది.

ఇదిలా ఉండగా, గత వారంరోజుల క్రితం కమర్షియల్ సిలిండర్‌పై ధర తగ్గించిన విషయం తెలిసిందే. హోటళ్లు, రెస్టారెంట్స్‌తో పాటు ఇతర వాటికి వినియోగిచే కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరపై రూ.41 మేర తగ్గించారు. కానీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పెరిగిన వస్తు ధరలకు అల్లాడుతున్న ప్రజలపై గ్యాస్ ధరలు మరింత భారం కానున్నాయి.

Exit mobile version
Skip to toolbar