Former Karnataka CM SM Krishna Passes Away: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో బెంగుళూరులోని సదాశివనగర్‌లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ.. 1989 నుంచి 1993 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1993 నుంచి 94 మధ్యన కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అలాగే 1999 నుంచి 2004 వరకు సీఎంగా వ్యవహరించారు. అనంతరం 2004 నుంచి 2008 మధ్యకాలంలో మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.