Site icon Prime9

Maharashtra Blast: మహారాష్ట్రలో తీవ్ర విషాదం.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఐదుగురి మృతి

Five Dead in Massive Explosion in Ordnance Factory in Maharashtra Blast: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఘటనా స్థలంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అగ్ని మాపక శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది.

వివరాల ప్రకారం.. జవహర్ నగర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం రెస్క్యూ టీంతో పాటు మెడికల్ టీమ్స్ చికిత్స అందిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పైకప్పు కూలిపోయిందని, జేసీబీ సాయంతో తొలగిస్తున్నట్లు కలెక్టర్ భండారా సంజయ్ కోల్టే తెలిపారు. అలాగే ఎస్‌డీఆర్ఎఫ్ చర్యలు చేపట్టుతోంది.

Exit mobile version