Site icon Prime9

EPFO 3.0: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఏటీఎంలోనే నగదు విత్ డ్రా!

EPFO 3.0 Withdraw PF from ATM

EPFO 3.0 Withdraw PF from ATM

EPFO 3.0 Withdraw PF from ATM: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇక పీఎఫ్ డబ్బులను సులువుగా తీసుకోవచ్చు. ఈ మేరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ 3.0 విధానం నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందులో ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

 

పీఎఫ్ విధానాన్ని పెన్షనర్లకు మరింత చేరువలో ఉండే విధంగా ఈ 3.0 విధానాన్ని తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్‌పామ్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఈజీగా చేయడంతో పాటు కేవైసీ ప్రక్రియను వేగవంతం కానున్నాయి. అలాగే అమౌంట్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సరళంగా, వేగం కానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

కాగా, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రత్యేక ఏటీఎం కార్డును జారీ చేయనుంది. ఈ కార్డు పీఎఫ్ ఖాతాకు లింక్ చేస్తారు. ఆ తర్వాత కార్డును ఉపయోగించి ఖాతాదారులు తమ పీఎఫ్ నగదును నేరుగా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే యూపీఐ ద్వారా నగదును డ్రా చేసుకునేందుకు తొలుత మీ పీఎఫ్ ఖాతాను యూపీఐకి లింక్ చేయాలి. అంతేకాకుండా, ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాకు పీఎఫ్ నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar