Site icon Prime9

Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత

Economist Bibek Debroy Passed Away: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులకు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ మేరకు జీర్ణాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వెల్లడించింది. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికతతోపాటు విభిన్న రంగాల్లో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారని మోదీ ట్వీట్ చేశారు. తన రచనలు, దేశంలో మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారన్నారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషికి అతీతంగా, అతను మన ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆయనకు ఇష్టమన్నారు. యువత కోసం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారని మోదీ అన్నారు.

Exit mobile version