Site icon Prime9

Earthquake: ఉదయాన్నే భారీ భూకంపం.. 32 మంది దుర్మరణం

Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు.

ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ తో పాటు పలు రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు రోడ్డుపైకి పరుగులు తీశారు. కాసేపటి వరకు ఏం జరుగుతుందో అర్ధం కాక అయోమయానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, గోకర్ణేశ్వర్ ప్రాంతానికి సమీపంలో భూకంప కేంద్రం ఉందని అనుమానిస్తున్నారు. ఈ భూకంపం తీవ్రత 6 నుంచి 7 గా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ భూకంప తీవ్రత జరిగిన నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా నివేదికలు అందలేదు.

కాగా, ఈ భూకంప తీవ్రతకు 32 మందికి పైగా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version