Site icon Prime9

Mohan Bhagavath: మహిళ తోనే అభివృద్ధి సాధ్యం…ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Development is only possible with women...RSS Chief

Development is only possible with women...RSS Chief

RSS Chief: దేశాభివృద్ధి మహిళలతోనే సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. దేశ ఐక్యమత్యాన్ని వ్యతిరేకించే శక్తులు సనాతన ఆచారాలు, ధర్మానికి అడ్డుంకులు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందూ అనే పదాన్ని ఆర్ఎస్ఎస్ వీడదన్నారు. అయితే హిందూ అనే పదం పట్ల అభ్యంతరం చేస్తున్న వ్యక్తులు ఇతర పదాలను వాడాలనుకొంటుంటే ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

విజయ దశమి ఉత్సవాలను పురస్కరించుకొని మహారాష్ట్ర నాగ్ పూర్ లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పాల్గొన్నారు. వందేళ్లు కల్గిన ఆర్ఎస్ఎస్ చరిత్రలో తొలిసారిగా మహిళా వర్గానికి చెందిన పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంధ్ర ఫడ్నవీస్ లు హాజరైనారు.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మహిళలను సాధికారులుగా చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా తగ్గట్టుగా వనరులు ప్రధానం అన్నారు. భవిష్యత్ లో పెరిగిన జనాభా భారం కాకూడదన్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నూతన జనాభా విధానాన్ని రూపొందించుకోవాలని సూచించారు. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారితీస్తాయని హెచ్చరించారు.

జనభా నియంత్రణకు ప్రయత్నించి నేడు చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. అయితే మన దేశంలో మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగేలా 57కోట్ల మంది యువత ఉన్నారన్న ధీమా వ్యక్తం చేశారు. ఆహార భద్రతపై దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉందంటూ మరో 50 ఏళ్ల తర్వాత భారత్ కు ఏం జరుగుతుందో అన్న ముందస్తు ఆలోచనలతో సాగలన్నారు.

దేశంలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారన్నారు.

ఇది కూడా చదవండి:World Space Week: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలు

Exit mobile version