Site icon Prime9

PM Narendra Modi: పీఎంఓ సిబ్బందితో రక్షా బంధన్‌ జరుపుకున్న ప్రధాని మోదీ

New Delhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అధికార గృహంలో బాలికలతో రక్షణా బంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది స్వీపర్స్‌, ప్యూన్స్‌, గార్డెనర్స్‌, డ్రైవర్ల కుమార్తెలతో కలిసి రక్షా బంధన్‌ సంబరాలు జరుపుకున్నారు. బాలికలు ప్రధానమంత్రి రాఖీలు కట్టారు. ప్రధాని తన ట్విట్టర్‌ ఖాతాలో వీడియోలు షేర్‌ చేశారు. ఇది ప్రత్యేకమైన రక్షా బంధన్‌ అని యువ బాలికలతో కలిసి సంబరాలు జరుపుకున్నానని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రక్షా బంధన్‌ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

Exit mobile version