CM Omar Abdullah Intresting Comments about Delhi Election Results 2025: ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ పార్టీ కూడా వెనుకంజలో కొనసాగుతోంది. ఈ INDIAరెండు పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఇండీ కూటమిపై విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
‘ జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని ఆ జిఫ్‌లో ఉంది. ఇండీ కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇండీ కూటమిలోని గొడవలు ఎక్కువయ్యాయని, అందుకే ఫలితాలు దారుణంగా వస్తున్నాయని అర్ధం వచ్చేలా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా ట్వీట్ చేశారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025