Site icon Prime9

Onion Exports: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఎగుమతులపై సుంకం రద్దు

Centre withdraws 20% duty on Onion Export: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20 శాతం సుంకం రద్దు చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడుతుందనే ముందుచూపుతో కేంద్ర 2023లో ఉల్లి ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఉల్లిపై ఉన్న ఎగుమతిని ఎత్తివేసింది.

 

అయితే, ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకం విధించింది. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో 20శాతం సుంకం తగ్గించింది. దీంతో 2023 -24 ఏడాదిలో ఉల్లి ఎగుమంతి 17.17 లక్షల టన్నులు, 2024-25 ఏడాదిలో మార్చి 18 వరకు 11.65 లక్షల టన్నులు ఉన్నట్లు కేంద్రం వివరించింది. ప్రస్తుతం సుంకం రద్దుతో మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

కాగా, ప్రస్తుతం ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండడంతో పాటు మార్కెట్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రం ఉల్లిపై ఉన్న సుంకం వంటి పరిమితులను తొలగించింది. అంతేకాకుండా వినియోగదారులకు తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ప్రధానంగా దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకే పరిమితులను విధిస్తుంది.

Exit mobile version
Skip to toolbar