Site icon Prime9

Amit Shah: అవినీతి సర్కారును గద్దెదించాలి.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Central Home Minister Amit Shah in Jharkhand: ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశంలోని అత్యంత అవినీమయ సర్కారుగా మారిందని, వారిని గద్దెదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఝార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమన్నారు.

ఎన్ని తరాలు వచ్చి అడిగినా ..
ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్నివర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకమనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. రాహుల్ తన వెంట ఎప్పుడూ రాజ్యాంగ నలికీ ప్రతిని తీసుకెళ్లి, ప్రచారంలో చూపిస్తూ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ ఎన్నటికీ భారత్ లో అంతర్భాగమేనని, ఎన్ని తరాలు వచ్చి అడిగినా అర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారన్నారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని దయ్యబట్టారు.

Exit mobile version
Skip to toolbar