Prime9

Annual Fastag Policy: కేంద్రం బంపరాఫర్.. ఇక టోల్ కష్టాలకు చెక్!

Annual Fastag Policy with Rs 3,000: ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించేందుకుగాను టోల్ గేట్ల వద్ద ప్రతీసారి చెల్లింపు లేకుండా ఉండేలా ఓ విధానాన్ని రూపొందించింది. ఏడాదంతా ప్రయాణానికి ఒకేసారి చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే కొత్త టోల్ పాలసీని తీసుకువచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. దీనివలన వాహనదారులకు సులువుగా, ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణం లభిస్తుంది. తరచుగా టోల్ గేట్ల ఆగిపోవడం వంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. భారతదేశ జాతీయ రహదారి నెట్ వర్క్ అంతటా ఒకే డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

 

ఈ స్కీమ్ ప్రతిపాదనలో భాగంగా, వాహన యజమానులకు త్వరలో రూ. 3 వేల వార్షిక రుసుము కొత్త ప్లాన్ తీసుకురాబోతోంది. దీని వలన ఓకేసారి రూ. 3 వేలు చెల్లించి ఏడాది పొడవునా వాహనదారులు జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేలు, రాష్ట్ర ఎక్స్ ప్రెస్ వేపై పరిమితులు లేకుండా, స్వేచ్ఛగా తిరగవచ్చు. కొత్తగా తీసుకురాబోతున్న ఈ స్కీమ్ లో రెండు రకాల చెల్లింపుల విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఒకటి రూ. 3000 తో వార్షిక పాస్ విధానం. ఇది అన్ లిమిటెడ్ ట్రావెలింగ్ పరిమితిని అందిస్తుంది. రెండోది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే విధానం. ఈ స్కీం కింద వాహనదారులు 100 కిలోమీటర్లకు రూ. 50 ఫిక్స్ డ్ అమౌంట్ చెల్లిస్తారు. దీనికి అదనపు డాక్యుమెంటేషన్ ఏమీ ఉండదు.

 

Exit mobile version
Skip to toolbar