Loud Explosion off at School in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం పేలుడు శబ్దం వినిపించింది. అయితే ఈ పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు సమీపంలోని షాపుల అద్దాలు, వాహనాలు, స్థానికంగా ఉన్న కారు అందాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు అనంతరం ఆ ప్రాంతం అంతా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున పోగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అగ్నిమాపక శాఖ బృందాలు కూడా అక్కడికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై విచారిస్తున్నారు.
ఈ పేలుడు ఉదయం 7:47 గంటలకు జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి అమిత్ గోయల్ తెలిపారు. పేలుడు కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ బృందాలు, పోలీసు స్పెషల్ సెల్ అధికారులు పేలుడికి గల కారణాలను అన్వేషిస్తున్నారని చెప్పరు. ఇప్పి వరకు ్రమాదానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ప్రస్తుతం ఇది ఏ రకమైన పేలుడు, దాని మూలం ఏంటో స్పష్టంగా తెలియలేదన్నారు. విచారణలో డ్రైనేజ్ పైప్ లైన్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో క్రూడ్ బాంబు ఉండోచ్చని నిపుణులు సందేహిస్తున్నట్టు డీసీపీ చెప్పారు.