Site icon Prime9

Bihar : బీహార్‌లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి..!

Bihar

Bihar

Bihar : బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ప్రాంతంలో ఇరవై మంది వ్యక్తులు కల్తీ మద్యం సేవించి మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మాదేపూర్ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 2016 నుండి బీహార్‌లో మద్యం అమ్మకాలు మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది.

బుధవారం ఉదయం ముగ్గురు మరణించారని మరికొంతమంది వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్నట్లు నాకు సమాచారం అందింది” అని ఎస్పీ ఎస్ కుమార్ తెలిపారు.పోస్టుమార్టం అనంతరమే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతుల బంధువులు మరణాలకు కారణం నకిలీ మద్యం అని పేర్కొన్నారు.

అయితే పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఆగస్టు నెలలో జిల్లాలోని భూల్‌పూర్ గ్రామంలో ఇలాంటి కేసులో ఐదుగురు వ్యక్తులు నకిలీ మద్యం సేవించి మరణించారు.ఇదిలా ఉండగా, బీహార్ అసెంబ్లీలో కల్తీ మద్యం మృతుల సంఖ్యపై రగడ చెలరేగింది. రాష్ట్రంలో బీజేపీ కల్తీ మద్యం విక్రయిస్తోందని, వారిని తాగుబోతులని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోపించారు.

Exit mobile version