Site icon Prime9

Tirupati: నవంబర్‌ 1 నుంచి తిరుపతిలో టైమ్‌స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు

Tirupati

Tirupati

Tirupati: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్‌ 1 నుంచి టైమ్‌స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలతో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్‌ 1 నుంచి బ్రేక్‌ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు.ఉదయం 8.30 నుంచి బ్రేక్‌దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు ఇ-బైక్‌లు అందజేస్తామని అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తిరుపతిలో స్లాటెడ్‌ సర్వ దర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీ విధానాన్ని టీటీడీ నిలిపివేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. అయితే యాత్రికుల సౌకర్యార్థం గత బోర్డు సమావేశం వీటి టోకెన్ల జారీని పునరుద్ధరించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. కోటా అయిపోయే వరకు రోజు వారీగా భక్తులకు ఈ టోకెన్లు జారీ చేయబడతాయి.

Exit mobile version
Skip to toolbar